Rajamouli: ‘మగధీర’ టైమ్‌ నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నా: రాజమౌళి

తన సతీమణి రమతో కలిసి రాజమౌళి (Rajamouli) ఓ పర్యాటక ప్రదేశానికి వెళ్లారు. ఎన్నో ఏళ్ల నుంచి తాను ఇక్కడికి రావాలనుకుంటున్నానని చెప్పారు. 

Published : 19 Aug 2023 01:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘బాహుబలి: ది బిగినింగ్‌’ (Bahubali) కాన్సర్ట్‌లో భాగంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) ఇటీవల నార్వేకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ దేశంలోని ఓ సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశాన్ని తాజాగా ఆయన సందర్శించారు. ‘మగధీర’ (Magadheera) టైమ్‌ నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నానని చెప్పారు. ‘‘మగధీర’ కోసం రీసెర్చ్‌ చేస్తున్నప్పుడు పల్పిట్ రాక్ (Pulpit Rock) ఫొటోలు చూశా. అప్పటి నుంచి ఇక్కడికి రావాలని ఎన్నోసార్లు అనుకున్నా. స్టావెంజర్‌లో జరగనున్న ‘బాహుబలి’ ఫిల్మ్‌ కాన్సర్ట్‌కు ధన్యవాదాలు. ఎట్టకేలకు నేను ఈ ప్రాంతానికి రాగలిగాను’’ అని ఆయన పేర్కొన్నారు. పల్పిట్‌ రాక్‌పై తన సతీమణితో దిగిన ఫొటోలను రాజమౌళి నెట్టింట షేర్‌ చేశారు.

రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్స్‌లో ‘బాహుబలి’ ఒకటి. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘బాహుబలి: ది బిగినింగ్‌’కు సంబంధించిన ఓ కాన్సర్ట్‌ నార్వేలోని స్టావెంజర్‌ ఒపెరా హౌస్‌లో జరగనుంది. ఈ ప్రదర్శన కోసం రాజమౌళి, చిత్ర నిర్మాతలు రాఘవేంద్రరావు, శోభూ యార్లగడ్డ నార్వేకు వెళ్లారు. కాన్సర్ట్‌ వివరాలను తెలియజేస్తూ జక్కన్న ఇటీవల ట్వీట్‌ చేశారు. 

రివ్యూ: ప్రేమ్‌కుమార్‌.. సంతోష్‌ శోభన్‌ కొత్త మూవీ మెప్పించిందా?

‘‘లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో జరిగిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ అద్భుత ప్రదర్శనను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ దృశ్యాలు ఇప్పటికీ నా కళ్లలో అలాగే నిలిచి ఉన్నాయి. ఇక, ఇప్పుడు ఆగస్టు 18న నార్వేలోని స్టావెంజర్‌ ఒపెరా హౌస్‌లో ‘బాహుబలి -1’ ప్రదర్శన జరగనున్నందుకు ఆనందంగా ఉంది. స్టావెంజర్ సింఫనీ ఆర్కెస్ట్రా సారథ్యంలో ఇది ప్రదర్శన జరగనుంది’’ అని ఆయన పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని