Published : 08 Nov 2021 09:51 IST

Katrina Kaif: వేడుకగా విక్కీ-కత్రినా రోకా ఫంక్షన్‌..!

ముంబయి: బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్ నటి కత్రినాకైఫ్‌, నటుడు విక్కీకౌశల్‌ త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ నెలలో వీరి వివాహం జరగనుందని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విక్కీ-కత్రినాలకు దీపావళి రోజున రోకా ఫంక్షన్‌ జరిగినట్లు సమాచారం. కత్రినాకు ఎంతో ఆప్తుడైన దర్శకుడు కబీర్‌ఖాన్‌ నివాసంలో ఈ వేడుక నిర్వహించారట. కత్రినా, ఆమె తల్లి సుజానే టర్కోయెట్, ఇసాబెల్, విక్కీ, ఆయన తల్లిదండ్రులతోపాటు సోదరుడు సన్నీ కౌశల్‌ ఈ వేడుకలో పాల్గొని.. వివాహానికి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకున్నారట. ఇరు కుటుంబాలు పలు ఖరీదైన బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు, ఉత్తర భారతదేశంలో రోకా ఫంక్షన్‌కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వధూవరుల కుటుంబసభ్యులు ఒకచోట కలుసుకుని పెళ్లి తంతు, కట్నకానుకలపై మాట్లాడుకుని.. అన్నీ ఓకే అనుకున్నాక స్వీట్స్‌, ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

విక్కీ-కత్రినా కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. కత్రినా అంటే తనకెంతో ఇష్టమని ఇప్పటికే పలు సందర్భాల్లో విక్కీ బయటపెట్టారు. మరోవైపు కత్రినా సైతం విక్కీపై అమితమైన అభిమానాన్ని కనబరిచారు. విక్కీ నటించిన సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్‌ ఫోర్ట్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని