KrishnaRama: ‘ఈటీవీ విన్‌’లో ‘#కృష్ణారామా’.. టీజర్‌ చూశారా!

కేవలం రూ.1కే (రోజుకి) నాన్‌స్టాప్ వినోదాన్ని అందించే ఓటీటీ ‘ఈటీవీ విన్‌’. ఈ ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్‌ కానున్న ‘#కృష్ణారామా’ సినిమా టీజర్‌ విడుదలైంది.

Updated : 16 Nov 2023 15:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad), గౌతమి (Gautami) ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్‌ మదిరాజు రూపొందించిన చిత్రం ‘#కృష్ణారామా’ (#KrishnaRama). అనన్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, చరణ్‌ లక్కరాజు, రవి వర్మ, జెమిని సురేశ్‌, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ (ETV WIN)లో ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం టీజర్‌ను (#KrishnaRama Teaser) విడుదల చేసింది.

అనిల్‌ రావిపూడికి తమన్నాతో గొడవేంటి?

విదేశాల్లో స్థిరపడిన పిల్లలకు దూరమైన తల్లీదండ్రుల ఎమోషన్స్‌ నేపథ్యంలో ఈ సినిమాని తీర్చిదిద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. సోషల్‌ మీడియా సాయంతో.. వేల మైళ్ల దూరంలో ఉన్న తమ సంతానానికి ఆ దంపతులు ఎలా దగ్గరయ్యారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని