Dear: ఓటీటీలోకి ‘డియర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

జి.వి.ప్రకాశ్‌ కుమార్‌, ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్‌’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారైంది.

Published : 26 Apr 2024 18:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్‌ (gv prakash kumar) నటుడిగాను అలరిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఆయన, హీరోయిన్‌ ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh) జంటగా నటించిన చిత్రం ‘డియర్‌’ (Dear). ఈనెల 11న తమిళంలో, 12న తెలుగులో థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా మరోసారి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనెల 28 నుంచి ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ సినిమా క‌థేంటంటే: ప్రముఖ టెలివిజ‌న్ ఛాన‌ల్‌లో న్యూస్‌రీడ‌ర్‌గా ఉద్యోగం సంపాదించి, ప్రముఖులను ఇంట‌ర్వ్యూ చేయాల‌న్నది అర్జున్ (జి.వి.ప్రకాశ్‌) క‌ల‌. చిన్నపాటి శ‌బ్దాలకు కూడా నిద్ర నుంచి లేచిపోయే స‌మ‌స్యతో బాధ‌ ప‌డుతుంటాడు. మ‌రోవైపు, అర్జున్‌కి పూర్తి భిన్నంగా నిద్రలో గుర‌కపెట్టే స‌మ‌స్యతో బాధ‌ ప‌డుతుంటుంది దీపిక (ఐశ్వర్య రాజేశ్). ఈ ఇద్దరూ ఒక‌రి స‌మ‌స్య మ‌రొక‌రికి తెలియ‌కుండా పెళ్లి చేసుకుంటారు. ఆ స‌మస్యలు వీరి కాపురంలో ఎలాంటి చిచ్చుకు కార‌ణ‌మ‌య్యాయి? వీరి బంధం నిల‌బ‌డిందా? అన్నది మిగతా కథ.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని