Updated : 29 May 2022 08:15 IST

Cinema News: అలాంటి గెలుపుతో బతికుండాలి

విజయ్‌ ఆంటోని హీరోగా నవీన్‌ తెర కెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘జ్వాల’. జవ్వాజి రామాంజనేయులు, యం.రాజ శేఖర్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అక్షర హాసన్‌, అరుణ్‌ విజయ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను నటుడు రానా ఇటీవల విడుదల చేశారు. ప్రచార చిత్రం ఆద్యంతం యాక్షన్‌ సన్నివేశాలతో నింపేశారు. పోరాట ఘట్టాల్లో విజయ్‌, అరుణ్‌ పోటాపోటీగా నటించారు. ‘‘పాత రోమ్‌ నగరం గుర్తుందా మిత్రుడా! ఇద్దరు గ్లాడియేటర్స్‌ తలపడతారు. ఓడినవాడు చస్తాడు. గెలిచినవాడు మాత్రమే బతుకుతాడు. బతికుంటే అలాంటి గెలుపుతో బతికుండాలి. చచ్చినా కూడా అలాంటి వాడి చేతిలో చచ్చాము అనే గర్వంతో చావాలి’’ అంటూ టీజర్‌లో వినిపించిన సంభాషణలు ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి. దీనికి సంగీతం: నటరాజన్‌, కూర్పు: వెట్రికృష్ణన్‌, ఛాయాగ్రహణం: కె.ఎ.బచ్చ.


‘ది గ్రే మ్యాన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

పాన్‌ వరల్డ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం ‘ది గ్రే మ్యాన్‌’. మార్క్‌ గ్రీనీ రచించిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని  తెరకెక్కించారు. ర్యాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఏవన్స్‌, జెసికా హెన్‌విక్‌ తదితరులు నటించారు. జులై 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా పలు దేశీయ భాషల్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలివైన వాళ్లను చంపడం కూడా ఒక పండగే అన్న సంభాషణతో ‘ది గ్రే మ్యాన్‌’ ట్రైలర్‌ మొదలయింది. దర్శకులు రూసో బ్రదర్స్‌ తెరకెక్కించిన యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నతంగా ఉన్నాయి. ఈ సినిమాతో తొలిసారిగా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ధనుష్‌ ట్రైలర్‌లో కనిపించి అలరించాడు.


కాలేజీ రోజుల్ని గుర్తుచేసే.. రోజ్‌ మిల్క్‌

జై జాస్తి, అనంతిక జంటగా నాని బండ్రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘రాజమండ్రి రోజ్‌ మిల్క్‌’. డి.సురేష్‌బాబు, ప్రదీప్‌ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మించారు. వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు సుకుమార్‌ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘పూర్తి వినోదాత్మక చిత్రమిది. అందరికీ కాలేజీ రోజుల్ని గుర్తు చేస్తుంది’’ అన్నారు. ‘‘రెండో షెడ్యూల్‌ను జూన్‌ 10 నుంచి రాజమండ్రి, వైజాగ్‌లో చిత్రీకరిస్తాం. సెప్టెంబర్‌లో విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. సంగీతం: గోవింద్‌ వసంత్‌, అజయ్‌ అరసాడ, యశ్వంత్‌ నాగ్‌, భరత్‌ - సౌరభ్‌, ఛాయాగ్రహణం: ముఖేష్‌.జి, శక్తి అరవింద్‌.


మాస్‌ అంశాలతో.. ‘ఏజెంట్‌ నరసింహ 117’

యువ నటులతో దర్శకుడు లక్ష్మణ్‌ చాప్రాల తెరకెక్కించిన చిత్రం ‘ఏజెంట్‌ నరసింహ 117’. కీర్తికృష్ణ కథానాయకుడు. నిఖిత, మధుబాల నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను నిర్మించిన బి.నరసింహారెడ్డి కథనూ అందించారు. ఇటీవలే దీని ట్రైలర్‌ను ఫిల్మ్‌ ఛాంబర్‌లో విడుదల చేశారు. కార్యక్రమానికి హాజరైన పలువురు అతిథులు మాట్లాడుతూ ఇలాంటి చిన్న సినిమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. పూర్తి మాస్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో షాయాజీ షిండే, ప్రదీప్‌ రావత్‌, దేవ్‌ గిల్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం: రాజ్‌ కిరణ్‌, ఛాయాగ్రహణం: జయరాం, కూర్పు: మేనేజ్‌ శ్రీను.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని