Love Today: ఈ సినిమాకి ప్రేక్షకులే హీరోలు..

ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తమిళ చిత్రం ‘లవ్‌ టుడే’. ఈ సినిమాని అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత దిల్‌రాజు.

Updated : 20 Nov 2022 09:24 IST

ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తమిళ చిత్రం ‘లవ్‌ టుడే’ (Love Today). ఈ సినిమాని అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత దిల్‌రాజు. ఇది నవంబర్‌ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌, పాటల్ని విడుదల చేశారు. కార్యక్రమంలో వంశీ పైడిపల్లి, అనిల్‌ రావిపూడి, రాధికా శరత్‌ కుమార్‌ బిగ్‌ సీడీని ఆవిష్కరించారు. అనంతరం చిత్ర హీరో, దర్శకుడు ప్రదీప్‌ మాట్లాడుతూ.. ‘‘మూడేళ్ల కష్టం ఈ సినిమా. తమిళంలో మేము ఊహించిన దాని కన్నా పెద్ద విజయాన్ని అందుకున్నాం. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు విడుదల చేయడం ఆనందంగా ఉంది. యువన్‌ మంచి సంగీతమందించారు. సత్యరాజ్‌, రాధికా, యోగిబాబు తమ పాత్రల్లో మెప్పిస్తారు. ఈ చిత్రంలో నేను హీరో కాదు. ప్రేక్షకులే హీరో. తప్పకుండా దీంతో ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతారు’’ అన్నారు. ‘‘ఇది తమిళనాడులో చిన్న సినిమాగా విడుదలై.. రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. దీన్ని రీమేక్‌ చేస్తే ఆ మ్యాజిక్‌ రాదనే ఉద్దేశంతో అనువదించాలని నిర్ణయించుకున్నా. సినిమా చూసిన వారంతా ఇందులోని ఏదోక పాత్రతో కనెక్ట్‌ అవుతారు’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు. ఈ వేడుకలో ఇవాన, రవీనా, యువన్‌ శంకర్‌రాజా తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని