Manchu Vishnu: ఆరు నెలల్లో భూమి పూజ

‘‘మా సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే తన ప్రధాన ఎజెండా’’ అన్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. ఆదివారం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) సభ్యులకు ఏఐజీ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో

Updated : 16 May 2022 10:58 IST

మంచు విష్ణు

‘‘మా సభ్యుల సంక్షేమం, ఆరోగ్యమే తన ప్రధాన ఎజెండా’’ అన్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. ఆదివారం మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) సభ్యులకు ఏఐజీ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘మా సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసేందుకు ఏఐజీ ముందుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. ‘మా’ అసోసియేషన్‌ శాశ్వత భవనానికి ఆరు నెలల్లో భూమి పూజ చేస్తాం. సినిమా టికెట్‌ ధరల విషయంలో నేను మాట్లాడలేదని అందరూ విమర్శించారు. కావాలనే నేను మౌనంగా ఉన్నాను. టికెట్‌ ధరలు పెంచితే కొందరికి, తగ్గిస్తే మరికొందరికి ఇబ్బందులు వస్తాయి. టికెట్‌ రేట్లు అనేది చాలా పెద్ద అంశం. దీని గురించి తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌, ఫిల్మ్‌ఛాంబర్‌ అంతా కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది’’ అన్నారు.

సినీనటుడు నరేష్‌ మాట్లాడుతూ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో భారీ వైద్యశిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మా సభ్యులకు అవకాశాలు కల్పించే విధంగా గౌతమ్‌రాజు నేతృత్వంలో విష్ణు ఓ కమిటీని ఏర్పాటు చేశారని నరేష్‌ తెలిపారు. మా సభ్యులు శివ బాలాజీ, రవి, పృధ్వీ, హరినాథ్‌, ఏఐజీ ఆసుపత్రి డా.జి.వి.రావు పాల్గొన్నారు.


సందర్భంగా ప్రముఖ వైద్యులు, ఏఐజీ ఆసుపత్రి డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘‘40 ఏళ్లలో నేను ఒకే ఒకసారి సినిమా థియేటర్‌కు వెళ్లాను. అప్పట్లో సమ్మె కారణంగా థియేటర్‌ను మూసివేయడంతో ఆ రోజూ సినిమా చూడలేక పోయా’’ అని తెలిపారు. సినీ కళాకారులు ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల శరీరంలో ఉండే సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్స అందించే అవకాశం ఉంటుం దన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు