Chopra: ఇద్దరు కుటుంబసభ్యుల్ని కోల్పోయిన నటి

‘అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి కనీసం ఆసుపత్రిలో ఒక పడక కూడా దొరకనప్పుడు ఇకపై, నేను 18 శాతం జీఎస్టీని చెల్లించను’ అని నటి మీరాచోప్రా అన్నారు...

Published : 17 May 2021 01:30 IST

ఇకపై జీఎస్టీ కట్టను అంటూ ట్వీట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌‌: ‘అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి కనీసం ఆసుపత్రిలో ఒక పడక కూడా దొరకనప్పుడు ఇకపై, నేను 18 శాతం జీఎస్టీని చెల్లించను’ అని నటి మీరాచోప్రా అన్నారు. ‘బంగారం’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ దిల్లీ భామ కరోనా కారణంగా 10 రోజుల వ్యవధిలో ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ పోస్ట్‌ పెట్టారు.

‘‘ఏప్రిల్‌ 28న బెంగళూరులో నా కజిన్‌ మృతిచెందాడు. కొవిడ్‌ బారిన పడడంతో ఆక్సిజన్‌ అందక అతను ఎంతో ఇబ్బందిపడ్డాడు. ఐసీయూలో బెడ్‌ కోసం 24 గంటలపాటు ఎంతో ప్రయత్నించాం. ఎట్టకేలకు బెడ్‌ దొరికే సమయానికి అతని ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. మనకు సరైన మెడికల్‌ వసతులు లేకపోవడంతోనే నా కజిన్‌ చనిపోయాడు. సరిగ్గా 10 రోజుల వ్యవధిలోనే మరో కజిన్‌ కొవిడ్‌ వల్లే మృతి చెందాడు. నిజం చెప్పాలంటే.. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదు’ అని మీరా చోప్రా ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె.. ప్రాణాలు రక్షించుకోవడానికి ఆసుపత్రుల్లో బెడ్‌ లేదా ఆక్సిజన్‌ లభించడం లేదు. కాబట్టి, ఇకపై జీఎస్టీ చెల్లించను అంటూ ట్వీట్‌ పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని