‘ముంబయి సాగా’ టీజర్‌ అదిరింది! 

బాలీవుడ్‌లో ముంబయి నేపథ్యంగా వచ్చే అండర్‌వరల్డ్ మాఫియా కథలకు డిమాండ్‌ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తాజాగా విడుదలైన ‘ముంబయి సాగా’టీజర్‌ మళ్లీ ఆ వేడిని పుట్టిస్తోంది. జాన్‌అబ్రహం, ఇమ్రాన్‌ హష్మీ, సునీల్‌శెట్టి, కాజల్‌ అగర్వాల్‌, మహేష్‌

Updated : 24 Feb 2021 17:51 IST

ముంబయి: బాలీవుడ్‌లో ముంబయి నేపథ్యంగా వచ్చే అండర్‌వరల్డ్ మాఫియా కథలకు డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా విడుదలైన ‘ముంబయి సాగా’ టీజర్‌ మళ్లీ ఆ వేడిని పుట్టిస్తోంది. జాన్‌అబ్రహం, ఇమ్రాన్‌ హష్మీ, సునీల్‌శెట్టి, కాజల్‌ అగర్వాల్‌, మహేష్‌ ముంజ్రేకర్‌ వంటి భారీ తారగణంతో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అమర్త్యరావ్‌గా జాన్‌ అబ్రహం పరిచయం రోమాంచితంగా ఉంది. పోలీస్‌ పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్‌ హష్మీ ఎన్‌కౌంటర్లతో రౌడీలను మట్టుబెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. టీజర్‌ చూస్తుంటే ఇదొక కరుడుగట్టిన మాఫియా కథలా ఉంది. టి-సిరీస్‌ పతాకంపై సంజయ్‌గుప్తా దర్శకత్వంలో ఈ చిత్రం వస్తోంది. మార్చి 19 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. మరి లేటెందుకు ఆ టీజర్‌ను మీరు చూసేయండి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని