శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత సంచారం!

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది.

Updated : 28 Apr 2024 17:06 IST

శంషాబాద్‌: హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఆదివారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్‌పోర్టు ప్రహరీ నుంచి అది దూకినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌పోర్టు కంట్రోల్‌ రూమ్‌లో అలారం మోగింది. దీంతో అక్కడి భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరించినట్లు తేలింది. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లోకి చేరుకున్న అటవీ సిబ్బంది.. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని