Niharika: వరుణ్‌ తేజ్‌కు నిహారిక స్పెషల్‌ గిఫ్ట్‌

తన అన్న వరుణ్‌తేజ్‌కు నటి నిహారిక స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ‘అన్నయ్యా నువ్వు పిలిస్తే’ లిరికల్‌ పాటను తన ప్రియమైన అన్నకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. నటుడు నవీన్‌ చంద్రా,  అవికా గోర్‌ కీలకపాత్రల్లో...

Updated : 06 Dec 2022 15:55 IST

మా అన్నయ్యకు ఇది అంకితం

హైదరాబాద్‌: తన అన్న వరుణ్‌తేజ్‌కు నటి నిహారిక స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ‘అన్నయ్యా నువ్వు పిలిస్తే’ లిరికల్‌ పాటను తన ప్రియమైన అన్నకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. నటుడు నవీన్‌ చంద్రా, అవికా గోర్‌ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’. అన్నాచెల్లెళ్లు మధ్య ఉండే అనురాగం, ఆప్యాయతలు తెలియజేసే విధంగా ఈ సినిమా తెరకెక్కింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘బ్రో’ నుంచి రాఖీ పండుగని పురస్కరించుకుని తాజాగా ఓ లిరికల్‌ పాట విడుదలైంది. ప్రముఖ గాయని సునీత ఈ పాటను ఆలపించారు. ‘ఈ రోజు కోసం నేనెంతగానో చూస్తూనే ఉన్నాను ఇన్నాళ్లుగా’ అంటూ సాగే ఈ పాట ప్రతిఒక్కర్నీ ఆకట్టుకునేలా ఉంది. కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేఖర్‌చంద్రా స్వరాలు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని