Ott movies in telugu: క్రేజీ మూవీస్‌ ఈ వారమే.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు!

Ott movies in telugu: ఈ వారం థియేటర్‌లో పలు ఆసక్తికర చిత్రాలు విడుదలవుతుండగా, ఓటీటీలో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు వస్తున్నాయి. మరి ఈ వారం పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రానున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి.

Published : 24 Aug 2023 10:00 IST

‘బ్రో’ వచ్చేస్తున్నాడు

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)- సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకుడు. ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రం గత నెలలో విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఆగస్టు 25న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నుంచి స్ట్రీమింగ్‌కానుంది.


యువత ఎదురు చూపులకు శుక్రవారంతో తెర

బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ముక్కోణపు ప్రేమ కథ ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో (Baby the movie On Aha) స్ట్రీమింగ్‌ కానుంది. ఆగస్టు 25 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు. ‘ఆహా గోల్డ్‌’ సభ్యత్వం కలిగిన వారు ఈ సినిమాను 12 గంటల ముందు నుంచే చూడొచ్చు.


ఓటీటీలోకి వచ్చేసిన ‘స్లమ్‌డాగ్‌ హస్బెండ్‌’

సంజయ్‌ రావు, ప్రణవి మానుకొండ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్లమ్‌డాగ్‌ హస్బెండ్‌’ (Slumdog Husband). సునీల్‌, ఆలీ, బ్రహ్మాజీ, సప్తగిరి, చంద్ర, యాదమరాజు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఏ.ఆర్‌.శ్రీధర్‌ దర్శకుడు. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జులై నెలలో థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ఇప్పుడిదే చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • రాగ్నరోక్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 24
  • కిల్లర్‌ బుక్‌ క్లబ్‌ (స్పానిష్‌) ఆగస్టు 25
  • లిఫ్ట్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 25
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • ఆఖ్రి సోచ్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 25
  • బుక్‌ మై షో
  • సమ్‌వేర్‌ ఇన్‌ క్వీన్స్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 21
  • లయన్స్‌ గేట్‌ప్లే
  • ఎబౌట్‌ మై ఫాదర్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 25
  • జియో సినిమా
  • లఖన్‌ లీలా భార్గవ (హిందీ) ఆగస్టు 21
  • బజావ్‌ (హిందీ) ఆగస్టు 25
  • యాపిల్‌ టీవీ ప్లస్‌
  • ఇన్వాజిన్‌2 (వెబ్‌సిరీస్‌)ఆగస్టు 23
  • వాంటెడ్‌: ది ఎస్కేప్‌ ఆఫ్‌ కార్లోస్‌ గోసన్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 25
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని