Parineeti-Raghav : ఒక్కటైన ‘రాగ్‌ణీతి’.. లీలా ప్యాలెస్‌లో వైభవంగా వివాహం

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Updated : 24 Sep 2023 20:15 IST

ఉదయ్‌పుర్ : బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయ్‌పుర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దిల్లీ, పంజాబ్‌ సీఎంలు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ సహా పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు. బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం తరలి రావడంతో పెళ్లి మండపం కళకళలాడింది. దిల్లీలో అర్దాస్‌ వేడుకతో ఈ పెళ్లి సందడి మొదలైంది. 22న వధూవరుల కుటుంబాలు ఉదయ్‌పుర్‌ చేరుకున్నాయి. అదే రోజు మెహందీ వేడుక నిర్వహించారు. ఈ నూతన జంటను అంతా ‘రాగ్‌ణీతి’ అని పిలుస్తున్నారు.

పరిణీతి-రాఘవ్‌ పెళ్లి సంగీత్‌.. సీఎంలు కేజ్రీవాల్‌, మాన్‌ సందడి

రాఘవ్‌, పరిణీతి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. బాలీవుడ్ నటిగా పరిణీతి, యువ ఎంపీగా రాఘవ్‌ చద్దా రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి గతంలో పంజాబ్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య జరిగిన IPL మ్యాచ్‌ను వీక్షించారు. వీరితో పాటు పరిణీతి సోదరుడు శివంగ్‌ చోప్రా కూడా కనిపించటంతో వీరు పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆ తరువాత దిల్లీలో నిశ్చితార్థ వేడుక జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని