Video: పరిణీతి-రాఘవ్‌ పెళ్లి సంగీత్‌.. సీఎంలు కేజ్రీవాల్‌, మాన్‌ సందడి

ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా, బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా వివాహ వేడుక మరికాసేపట్లో జరగనుంది. ఈ వేడుక వేళ నిన్న రాత్రి నిర్వహించిన సంగీత్‌లో సీఎంలు కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ సందడిచేశారు.

Published : 24 Sep 2023 15:52 IST

ఉదయ్‌పుర్‌: ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha)- బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) వివాహ వేడుక ఆదివారం జరగనుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్‌లో ప్రముఖలంతా సందడి చేశారు.  ఈ ప్రీ-వెడ్డింగ్‌ కార్యక్రమంలో దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. తమ పార్టీకి చెందిన యువ ఎంపీ చద్దా వివాహ వేడుక నేపథ్యంలో శనివారం ఉదయమే రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చేరుకున్న కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌లకు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 90s థీమ్డ్‌ సంగీత్‌ నైట్‌ పేరిట ఏర్పాటు చేసిన సంగీత్‌లో ప్రముఖ గాయకుడు నవరాజ్‌ హన్స్‌ పంజాబీ ట్యూన్‌లకు  సీఎం భగవంత్‌ మాన్‌ కాలు కదుపుతూ కనిపించారు. 

పరిణీతి- రాఘవ్‌ చద్దా పెళ్లి సందడి షురూ.. ఫొటోలు వైరల్‌

శనివారం నిర్వహించిన హల్దీ వేడుకలో పరిణీతి- రాఘవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంజాబీ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. హల్దీ వేడుక మొదలుకొని పెళ్లి వేడుక వరకు విచ్చేసే అతిథుల కోసం మెనూలో ఆసియా, భారతీయ వంటకాలు ఏర్పాటు చేశారు.  నిన్న సాయంత్రం వేళ సంగీత్‌ నిర్వహించగా అంతా సందడి చేశారు. ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌తో పలువురు ప్రముఖులు సైతం వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు.  మరోవైపు, ఈరోజు రాత్రి 8.30గంటలకు రిసెప్షన్‌ జరగనున్న వేళ.. అంతకుముందే సాయంత్రం 6.30గంటల లోపే ఈ స్టార్‌ జంట వివాహ వేడుక పూర్తి కానుంది.  పరిణీతి- రాఘవ్‌ చద్దా తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో మే నెలలో దిల్లీలోని కపుర్తలా హౌస్‌లో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని