Partner: కామెడీ థ్రిల్లర్‌ కథతో..

ఆది పినిశెట్టి, హన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘పార్ట్‌నర్‌’. మనో దామోధరన్‌ దర్శకుడు. పాలక్‌ లల్వాని కథానాయిక. యోగిబాబు, పాండియరాజన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నటుడు ఆర్య బుధవారం

Updated : 31 Mar 2022 14:17 IST

ది పినిశెట్టి, హన్సిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘పార్ట్‌నర్‌’. మనో దామోధరన్‌ దర్శకుడు. పాలక్‌ లల్వాని కథానాయిక. యోగిబాబు, పాండియరాజన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నటుడు ఆర్య బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో ఆది, హన్సిక స్టైల్‌గా ఓ కారులో కూర్చొని ఉండగా.. పాండియరాజన్‌ వెనక సీట్లో తాళ్లతో బంధించి ఉండటం ఆసక్తిరేకెత్తిస్తోంది. ఆ కారు వెనక యోగిబాబు ఓ నోట్ల కట్ట పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. విభిన్నమైన కామెడీ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని