NIKHIL: ఇప్పుడు వాళ్లే ఫోన్లు చేస్తున్నారు

ప్రభుత్వం మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా కరోనా వైరస్‌ని ఎంతో లైట్‌ తీసుకున్నారని నటుడు నిఖిల్‌ అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ క్యాన్సిల్‌ కావడంతో ఇంటికే పరిమితమైన ఆయన సోషల్‌మీడియా వేదికగా ఎంతోమంది....

Published : 17 May 2021 10:49 IST

హైదరాబాద్‌: ప్రభుత్వం మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా కరోనా వైరస్‌ని ఎంతో లైట్‌గా తీసుకున్నారని నటుడు నిఖిల్‌ అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆయన సోషల్‌మీడియా వేదికగా ఎంతోమంది కరోనా బాధితులకు చేతనైనంత సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టా లైవ్‌లో నెటిజన్లతో ముచ్చటించారు. కరోనా వైరస్‌ని తక్కువగా చేసి చూడొద్దని.. ప్రతిఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కొన్నిరోజుల క్రితం అందరూ కొవిడ్‌ని తక్కువగా అంచనా వేశారని అన్నారు.

‘‘తెలంగాణలో లాక్‌డౌన్‌ పెట్టకముందు హైదరాబాద్‌ రెస్టారెంట్ల బయట చాలామంది మాస్కులు లేకుండా పార్టీలు చేసుకున్నారు. వాళ్లని చూసి నేను ఎంతో షాక్‌ అయ్యాను. ఇప్పుడు వాళ్లకి కొవిడ్‌ వచ్చి ఆసుపత్రులకు వెళ్లిన తర్వాత బెడ్స్‌, ఆక్సిజన్‌, ఇంజక్షన్లు కావాలని ఫోన్లు చేస్తున్నారు. ప్రభుత్వమే కాదు.. ప్రజలు కూడా కొవిడ్‌ని చాలా తక్కువగా అంచనా వేశారు’’ అని నిఖిల్‌ అన్నారు. మరోవైపు, కరోనా కారణంగా బయట పరిస్థితులు ఎంతో క్లిష్టంగా మారాయని.. ఆక్సిజన్‌ అందక ఎంతో మంది కళ్ల ఎదుటే చనిపోతున్నారని ఇటీవల ఆయన ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందరూ ఇళ్లలోనే ఉండాలని, ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవాలని సూచించారు. చేతనైనంత వరకూ ఎదుటివారికి సాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని