‘వకీల్‌సాబ్’ తీయడానికి కారణం వారే:దిల్‌రాజు
‘‘పింక్’ రీమేక్ తెలుగులో చేయడానికి ఆ చిత్ర కథ రాసిన రచయితలు, తీసిన దర్శకులు, నిర్మాత బోనీ కపూర్, హరీశ్ శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, వేణు శ్రీరామ్లే కారణం’ అని నిర్మాత దిల్ రాజు అన్నారు. ‘వకీల్‌సాబ్’ ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పవన్‌తో సినిమా చేయాలన్నది చాలా మంది నిర్మాతల కల. నా కల కూడా అదే..
ఇంటర్నెట్‌డెస్క్: ‘‘పింక్’ రీమేక్ తెలుగులో చేయడానికి ఆ చిత్ర కథ రాసిన రచయితలు, తీసిన దర్శకులు, నిర్మాత బోనీ కపూర్, హరీశ్ శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, వేణు శ్రీరామ్లే కారణం’ అని నిర్మాత దిల్ రాజు అన్నారు. ‘వకీల్‌సాబ్’ ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పవన్‌తో సినిమా చేయాలన్నది చాలా మంది నిర్మాతల కల. నా కల కూడా అదే. దాన్ని సాకారం చేసుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది. ఒక రోజు అజిత్ చిత్రం(నేర్కొండ పార్వాయ్) ట్రైలర్‌ను బోనీకపూర్ నాకు పంపారు. చూడగానే అజిత్‌పాత్రలో నాకు పవన్‌కల్యాణ్ గుర్తొచ్చారు. ఇదే విషయాన్ని హరీశ్ శంకర్‌కు చెబితే, ఈసారి కల్యాణ్‌గారిని కలిసినప్పుడు సినిమా గురించి చెబుదామని అన్నారు. ఆ తర్వాత తమిళంలో అజిత్ సినిమా చూసినప్పుడు నాకు స్క్రీన్‌పై ప్రతి సన్నివేశంలోనూ పవన్‌కల్యాణ్ కనిపించారు. ఒకరోజు త్రివిక్రమ్‌గారికి ఈ విషయం చెబితే, ఆయన పవన్‌కల్యాణ్ కలిసే ఏర్పాటు చేశారు. కలిసి కథ చెప్పిన వెంటనే ఆయనకూ నచ్చింది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు దర్శకులను అనుకున్నాం. ఒకరోజు నాకు వేణు శ్రీరామ్ గుర్తొచ్చాడు. పిలిచి ‘పింక్’ రీమేక్ గురించి చెబితే ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు నుంచే తన వెర్షన్లో సన్నివేశాలను చెప్పడం ప్రారంభించాడు. నాకు బాగా నచ్చాయి. దీంతో దర్శకుడిగా వేణును ఫిక్స్ చేశాం. వీరి వల్లే మా 25ఏళ్ల కల నెరవేరింది’’ అని దిల్ రాజు అన్నారు.
‘పవన్‌కల్యాణ్‌గారితో కలిసి పనిచేసిన ప్రతి రోజూ నాకు దక్కిన గౌరవం’ అని దర్శకుడు వేణు శ్రీరామ్ అన్నారు. ప్రీరిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. ‘మొదటిసారి కల్యాణ్‌గారితో యాడ్‌కు పనిచేశా. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం. జీవితంలో మహిళల ప్రాధాన్యత గురించి తెలియజేసేలా ఈ సినిమా ఉంటుంది. నేను పవన్ అభిమానినని సగర్వంగా చెప్పుకుంటా’ అని అన్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు వేణు శ్రీరామ్ సమాధానాలు ఇచ్చారు. ఇందులో పవన్‌కల్యాణ్ మూడు విభిన్న లుక్స్‌లో కనిపిస్తారని చెప్పారు. శ్రుతిహాసన్ క్లాసికల్ డ్యాన్సర్ అన్న ప్రచారం నిజం కాదని, ఇక సెకండాఫ్‌లో వచ్చే ఓ సర్ప్రైజ్ను థియేటర్లో చూడాలని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్‌లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్