Rakul: దక్షిణాది సినిమాలు గుర్తింపు తెచ్చుకోవడం మంచి విషయం: రకుల్‌

సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొద్దికాలంలేనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తెలుగు, తమిళం,హిందీ భాషల్లో విజయవంతమైన చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది ఈ అమ్మడు.

Published : 28 May 2022 02:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విజయవంతమైన చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాన్‌ ఇండియా చిత్రాల విజయాలపై మాట్లాడింది.

‘‘మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారు. వాటిని టీవీల్లోనూ చూసేవారు ఉంటారు. హిందీలో డబ్‌ చేసిన నా సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇలా ఎప్పటినుంచో జరుగుతుంది. కానీ, ఇప్పుడు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఇంతకు ముందు చూడని వాళ్లు కూడా ఇప్పుడు థియేటర్లకు వచ్చి చూస్తున్నారు. సినిమాకు భాషతో సంబంధం ఉండదు. అది ఒక ఎమోషన్‌ అని నేను గాఢంగా నమ్ముతా. మంచి సినిమాలు దేశవాప్తంగా గుర్తింపు పొందుతాయి. వాటిని అందరూ ప్రశంసిస్తారు. దక్షిణాది సినిమాలు గుర్తింపు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. మనం ఒకరికొకరు సహకరించుకుంటూ సినిమాలు తీస్తే ఎంత బాగుంటుందో ఊహించుకోండి’’ అంటూ రకుల్‌ తన అభిప్రాయాన్ని పంచుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని