allu arjun: పుట్టిన రోజు ప్రత్యేకం

కథానాయకుల పుట్టినరోజున వాళ్ల కొత్త సినిమాలకి సంబంధించిన ఆసక్తికరమైన సంగతులు బయటకు వస్తుంటాయి. కొత్త చిత్రాల ప్రకటనలు మొదలుకొని... అప్పటికే  చేస్తున్న సినిమాల ప్రచార చిత్రాల విడుదల వరకూ చాలా సందడే ఉంటుంది.

Updated : 27 Feb 2024 09:28 IST

థానాయకుల పుట్టినరోజున వాళ్ల కొత్త సినిమాలకి సంబంధించిన ఆసక్తికరమైన సంగతులు బయటకు వస్తుంటాయి. కొత్త చిత్రాల ప్రకటనలు మొదలుకొని... అప్పటికే  చేస్తున్న సినిమాల ప్రచార చిత్రాల విడుదల వరకూ చాలా సందడే ఉంటుంది. అందుకే అభిమానులు ఆ రోజు కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తుంటారు.  రానున్న మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అగ్ర కథానాయకులు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ పుట్టినరోజులు వస్తున్నాయి. ఈ సందర్భంగా వాళ్లు చేస్తున్న సినిమాలకు సంబంధించి హంగామా షురూ కానుంది. రామ్‌చరణ్‌ సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదల తేదీని ఆయన పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ప్రకటించే అవకాశాలున్నట్టు సమాచారం. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దసరా లేదా దీపావళి సందర్భంగా విడుదల కావొచ్చని ప్రచారం సాగుతోంది. మరి ఎప్పుడనే విషయంపై చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు.  అలాగే అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పుష్ప2’ టీజర్‌ని ఆయన పుట్టినరోజైన ఏప్రిల్‌ 8న  విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే నెల నుంచే ప్రచార హంగామాకి తెర తీయనున్నట్టు సమాచారం. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని