Ram Charan: ఉప్సీ.. మనం ఇంకాస్త వేచి ఉండాలి: రామ్‌చరణ్‌

సినిమా ప్రమోషన్స్‌, షూటింగ్స్‌, పర్సనల్‌ మీటింగ్స్‌.. ఇలా వరుస వర్క్స్‌తో ఫుల్‌ బిజీగా ఉంటున్నారు నటుడు రామ్‌చరణ్‌ తేజ్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ విడుదల పూర్తైన...

Published : 07 May 2022 01:33 IST

హైదరాబాద్‌: సినిమా ప్రమోషన్స్‌, షూటింగ్స్‌, పర్సనల్‌ మీటింగ్స్‌.. ఇలా వరుస వర్క్స్‌తో ఫుల్‌ బిజీగా ఉంటున్నారు నటుడు రామ్‌చరణ్‌ తేజ్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ విడుదల పూర్తైన వెంటనే ఎటువంటి బ్రేక్‌ తీసుకోకుండా ఆయన శంకర్‌ సెట్‌లోకి అడుగుపెట్టారు. శంకర్‌ తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగ్‌లో గత కొన్నిరోజుల నుంచి ఆయన పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ షూట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరుగుతోంది. ఇదిలా ఉండగా.. చరణ్‌ సతీమణి ఉపాసన గురువారం సాయంత్రం తన పాత వెకేషన్‌ ఫొటోని షేర్‌ చేశారు. హాలీడేకి వెళ్లడానికి ఇంకాస్త వేచి ఉండాలని, ప్రస్తుతానికి ఇంత వేడిలో వర్క్‌ చేయడం కష్టంగా ఉందని పోస్ట్‌ పెట్టారు. ఆమె పోస్ట్‌కు చరణ్‌ స్పందించారు. ‘‘ఉపాసన నా మనసులో కూడా హాలీడేకు వెళ్లాలని ఉంది..!! కాకపోతే #RC15 షూట్‌ విశాఖలో జరుగుతోన్న కారణంగా మనం ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందే’’ అని తెలిపారు. చెర్రీ పోస్ట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని