Ranveer Singh: పెళ్లి ఫొటోలు డిలీట్‌ చేసిన రణ్‌వీర్ సింగ్‌

రణ్‌వీర్‌ సింగ్‌ తన ఇన్‌స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

Published : 08 May 2024 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌లో రణ్‌వీర్‌ సింగ్‌  - దీపికా పదుకొణె జోడి ఒకటి. తాజాగా రణ్‌వీర్‌ చేసిన పనికి అభిమానులు షాక్‌ అవుతున్నారు. తన ఇన్‌స్టాలో పెళ్లి ఫొటోలన్నిటినీ ఆయన డిలీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. రణ్‌వీర్‌ (Ranveer Singh) ఇన్‌స్టాలోకి అడుగుపెట్టి 5 సంవత్సరాలైంది. అప్పటినుంచి తన సినిమా విశేషాలను వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ హీరో (Ranveer Singh) పెళ్లి ఫొటోలను కావాలనే తొలగించారా లేదంటే సాంకేతికలోపం కారణంగా అవి కనిపించడం లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

వి.వి. వినాయక్‌ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్‌

గతంలో వీళ్లిద్దరూ విడిపోతున్నారంటూ పలుమార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిపై దీపిక (Deepika Padukone) స్పందిస్తూ ‘‘రణ్‌వీర్‌తో నా బంధం అన్యోన్యంగా సాగుతోంది’’ అని తెలిపింది. వీళ్లిద్దరూ కలిసి ‘రామ్ లీలా’ సినిమాలో నటించారు. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో  2018లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్‌లో వీళ్లు తల్లిదండ్రులు కానున్నారు. సినిమాల విషయానికొస్తే.. దీపిక (Deepika Padukone) ప్రధాన పాత్రలో నటించిన  ‘కల్కి 2898 ఏడీ’ విడుదలకు సిద్ధమైంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతోపాటు ‘సింగమ్‌ అగైన్‌’లోనూ పోలీస్‌గా కనిపించనున్నారు. రోహిత్‌ శెట్టి కాప్‌ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు