Ranbir Kapoor: ఆరోజు నేను చేసిన పనికి అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది: రణ్‌బీర్‌ కపూర్‌

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో చేసిన ఓ పని వల్ల తన తల్లి నీతూకపూర్‌ (Neetu Kapoor) కన్నీళ్లు పెట్టుకుందని బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor) అన్నారు. నటుడిగా కెరీర్‌ ప్రారంభించడానికంటే...

Published : 27 Jun 2022 01:23 IST

ముంబయి‌: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో చేసిన ఓ పని వల్ల తన తల్లి నీతూకపూర్‌ (Neetu Kapoor) కన్నీళ్లు పెట్టుకుందని బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor) తెలిపారు. నటుడిగా కెరీర్‌ ప్రారంభించడానికంటే ముందు తాను కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్‌ చేశానని.. అప్పుడు జరిగిన ఓ ఘటనని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘నటుడిగా నేను నా కెరీర్‌ ప్రారంభమైంది ‘సావరియా’తోనే అయినప్పటికీ.. అంతకంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచే  పరిశ్రమలో ఉన్నాను. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పలు చిత్రాలకు వర్క్‌ చేశాను. నాన్న రిషికపూర్‌ హీరోగా నటించిన ‘ప్రేమ్‌ గ్రంథ్‌’కి అసిస్టెంట్‌గా పనిచేసినందుకు రూ.250 ఇచ్చారు. అదే నా మొదటి సంపాదన. దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. తొలి సంపాదన అందుకున్న ఆనందంలో ఇంటికి వెళ్లి ఆ డబ్బుని మా అమ్మ పాదాలపై పెట్టాను. ఆ క్షణం అమ్మ నన్ను చూసి ఉద్వేగానికి లోనైంది. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది’’ అని ఆనాటి రోజుల్ని రణ్‌బీర్‌ గుర్తు చేసుకున్నారు.

ఇక, ప్రస్తుతం రణ్‌బీర్‌ చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో ఒకటి.. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న ‘బ్రహ్మాస్త్ర’. ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈసినిమా మూడు భాగాలుగా విడుదల కానుంది. మరోవైపు రణ్‌బీర్‌ ద్విపాత్రాభినయం పోషించిన ‘షంషేరా’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే ఆయన పై విషయాన్ని బయటపెట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని