salman khan: బబ్బర్‌ షేర్‌.. సల్మాన్‌?

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌, దర్శకుడు కబీర్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో ‘ఏక్‌ థా టైగర్‌’, ‘బజరంగీ భాయిజాన్‌’, ‘ట్యూబ్‌లైట్‌’ లాంటి యాక్షన్‌, డ్రామా చిత్రాలు వచ్చాయి.

Updated : 05 Jan 2024 10:01 IST

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌, దర్శకుడు కబీర్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో ‘ఏక్‌ థా టైగర్‌’, ‘బజరంగీ భాయిజాన్‌’, ‘ట్యూబ్‌లైట్‌’ లాంటి యాక్షన్‌, డ్రామా చిత్రాలు వచ్చాయి. ఇన్నేళ్లకి వీరిద్దరి కలయికలో త్వరలోనే మరో చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ‘ఆయన రాసుకున్న కథకి సల్మానే తగ్గ హీరో అని కబీర్‌ నమ్ముతున్నారు. ఈ సినిమా కోసం వారిద్దరూ రెండు మూడు సార్లు చర్చలు జరిపారు. ఈ చిత్రానికి ‘బబ్బర్‌ షేర్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. వీళ్ల కలయికలో రానున్న నాలుగో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ ప్రాజెక్టు నిలవనుంది. సల్మాన్‌ ఈ సినిమా పట్ల ఆసక్తి చూపుతున్నారు’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని