Shaakuntalam: ‘శాకుంతలం’ కోసం 15 కిలోల బంగారం
‘‘శాకుంతలం’ చిత్రం కోసం రూ.14కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు వినియోగించామ’’న్నారు దర్శకుడు గుణశేఖర్ (Guna Sekhar).
‘‘శాకుంతలం’ (Shakuntalam) చిత్రం కోసం రూ.14కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు వినియోగించామ’’న్నారు దర్శకుడు గుణశేఖర్ (Guna Sekhar). సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక ప్రేమ కథా చిత్రమిది. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ దీన్ని రూపొందించారు. ఇందులో శకుంతలగా సమంత నటించగా.. దుష్యంతుడి పాత్రను దేవ్ మోహన్ పోషించారు. నీలిమ గుణ నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గురువారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘‘దాన వీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితో నా చిత్రాల్లోనూ నిజమైన బంగారు ఆభరణాలే వాడుతున్నాం. మేము ఈ ‘శాకుంతలం’లోని ప్రధాన పాత్రధారుల ఆభరణాల కోసం సుమారు 15కిలోల బంగారం వినియోగించాం. ఆభరణాల్లో నిజమైన వజ్రాలను వాడాం. ప్రముఖ డిజైనర్ నీతూ లుల్లా సారథ్యంలో ఏడు నెలల పాటు శ్రమించి ఈ ఆభరణాలన్నింటినీ తీర్చిదిద్దారు’’ అన్నారు. కార్యక్రమంలో నీలిమ, హర్షిత, వసుంధర, నేహా తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్ కారుపై పుష్ అప్స్ తీస్తూ యువకుడి హల్చల్!
-
Politics News
Andhra News: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తాం: సీపీఐ రామకృష్ణ