Dunki: ‘డంకీ’ ట్రైలర్‌ రిలీజ్‌.. అర్థం వెతుకుతున్న నెటిజన్లు..

షారుక్‌ నటించిన ‘డంకీ’ (Dunki) ట్రైలర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Updated : 05 Dec 2023 14:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది రెండు సూపర్ హిట్లతో బాక్సాఫీస్‌ వద్ద షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) సంచలనం సృష్టించారు. తాజాగా ‘డంకీ’తో (Dunki) హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమయ్యారు. రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో ఆయన నటించిన ఈ చిత్రం కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీని ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నవ్వులతో పాటు భావోద్వేగాన్ని పంచుతోన్న ఈ ట్రైలర్‌ చూసి సినీ ప్రియులు ఖుష్‌ అవుతున్నారు. తాజాగా దీనిపై షారుక్‌ ట్వీట్‌ చేశారు.

ట్రైలర్‌ను సోషల్‌ మీడియాలో పంచుకున్న బాద్‌ షా.. ‘‘రాజ్‌ కుమార్‌ హిరాణీ విజన్‌ నుంచి ఈ కథ నాతో మొదలవుతుంది. నా ఫ్రెండ్స్‌తో కలిసి నేను దీన్ని ముగిస్తాను. స్నేహం, కామెడీ, విషాదం.. ఇలా ఎన్నో ఎమోషన్స్‌ ఇందులో ఉన్నాయి. ఇది చూసిన ప్రతి ఒక్కరికీ వాళ్ల కుటుంబంతో ముడిపడిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అందరి ఎదురుచూపులు ఫలించాయి. ట్రైలర్‌ను చూసి ఆనందించండి’’ అని రాశారు. ఇక షారుక్‌ చెప్పినట్లే ట్రైలర్ ఉంది. వినోదంతో మొదలైన ఈ ట్రైలర్‌లో ఎన్నో భావోద్వేగాలను చూపించారు. చివర్లో షారుక్‌ను ముసలివాడిగా చూపించి ముగించారు. ఇప్పటి వరకు సినిమాపై ఉన్న అంచనాలను ఈ ట్రైలర్‌ రెట్టింపు చేసింది.

ఆమె ఎక్స్‌ట్రార్డినరీ మహిళ.. శ్రీలీలపై నితిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక ప్రస్తుతం ‘డంకీ’ హ్యాష్‌ట్యాగ్‌ సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. అలాగే దీని అర్థాన్ని కూడా నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. దీని గురించి గతంలోనే షారుక్‌, రాజ్‌ కుమార్‌ హిరాణీ వివరించారు. ‘డంకీ’ అంటే మరోదేశంలోకి అక్రమంగా చొరబడడం అని.. భారత్‌ నుంచి ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించే నలుగురు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంటుందని ఓ ఇంటర్వ్యూలో షారుక్‌ చెప్పారు. ఇదే విషయాన్ని ట్రైలర్‌లోనూ చూపించారు. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్‌ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాప్సీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని  జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ ఫిల్మ్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు