Updated : 04 Jul 2022 07:34 IST

Tiger Shroff: టైగర్‌.. కొత్తగా మరొకటి

వైవిధ్యభరితమైన యాక్షన్‌ కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు కథానాయకుడు టైగర ష్రాఫ్‌ (Tiger Shroff). ప్రస్తుతం ఆయన వికాస్‌ బహ్ల్‌ దర్శకత్వంలో ‘గణపత్‌ : పార్ట్‌ 1’లో (Ganapath part 1) నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే శశాంక్‌ ఖైతాన్‌ (Shashank Khaitan) దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించనున్నారు టైగర్‌. ఇదొక  విభిన్నమైన యాక్షన్‌ కథతో రూపొందనుందని, ఆగస్టులో పొర్చుగల్‌లో చిత్రీకరణ మొదలవుతుందని, మూడు వారాల పాటు సాగే ఆ షెడ్యూల్‌లో యాక్షన్‌, ఛేజ్‌ సీక్వెన్స్‌లతో పాటు పాటలు చిత్రీకరించనున్నారని సమాచారం. మిగిలిన షెడ్యూల్స్‌ను భారత్‌తో పాటు ఇతర దేశాల్లో తెరకెక్కించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో ప్రకటన వెలువడనుంది. టైగర్‌ ప్రస్తుతం ‘గణపత్‌’ కాకుండా అక్షయ్‌ కుమార్‌తో కలిసి ‘బడే మియాన్‌ చోటే మియాన్‌’లోనూ నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది క్రిస్మస్‌కు విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని