Writer Padmabhushan: రచయిత పద్మభూషణ్‌ విచ్చేస్తున్నారు

‘రైటర్‌ పద్మభూషణ్‌’గా వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు సుహాస్‌. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కిస్తున్నారు. అనురాగ్‌, శరత్‌, చంద్రు మనోహర్‌ నిర్మిస్తున్నారు. టీనా శిల్పరాజ్‌ కథానాయిక.

Updated : 30 Dec 2022 07:01 IST

‘రైటర్‌ పద్మభూషణ్‌’గా (Writer Padmabhushan) వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు సుహాస్‌ (Suhas). ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షణ్ముఖ ప్రశాంత్‌ తెరకెక్కిస్తున్నారు. అనురాగ్‌, శరత్‌, చంద్రు మనోహర్‌ నిర్మిస్తున్నారు. టీనా శిల్పరాజ్‌ కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పంచుకున్న కొత్త పోస్టర్‌లో సుహాస్‌ ప్రకాశం బ్యారేజీ దగ్గర నిలబడి, ఫొటోకి ఫోజిస్తూ కనిపించారు. విజయవాడ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో సుహాస్‌ రచయితగా పేరు తెచ్చుకోవాలని కష్టపడే కుర్రాడిగా కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు