Cinema News: ‘బ్యాక్‌ డోర్‌’లో ఏం జరిగింది?

పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’. కర్రి బాలాజీ తెరకెక్కించారు. బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. 

Updated : 28 Oct 2021 09:34 IST

పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’. కర్రి బాలాజీ తెరకెక్కించారు. బి.శ్రీనివాస్‌ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాఘవేంద్రరావు  ఇటీవల చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ చూశాను. చాలా కొత్తగా.. ఆసక్తికరంగా ఉంది. సినిమాకి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నా. చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘ఓ ఆసక్తికర కథాంశంతో ఇది రూపొందింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకొని ‘క్లీన్‌ యు’ సర్టిఫికెట్‌ అందుకుంది’’ అన్నారు దర్శక నిర్మాతలు. సంగీతం: ప్రణవ్‌, ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ నారోజ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని