Manchi Rojulochaie : అందరికి మంచి రోజులొచ్చాయి

సంతోష్‌ శోభన్‌, మెహ్రీన్‌ జంటగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందించారు

Updated : 27 Oct 2021 07:55 IST

సంతోష్‌ శోభన్‌, మెహ్రీన్‌ జంటగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందించారు. ఈ సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం చిత్ర టైటిల్‌ గీతాన్ని విడుదల చేశారు. ‘‘మంచి రోజులొచ్చాయి.. అందరికి మంచి రోజులొచ్చాయి’’ అంటూ హుషారుగా సాగుతున్న ఈ పాటకు శ్యామ్‌ కాసర్ల సాహిత్యం అందించగా.. హరిచరణ్‌, శ్రావణి ఆలపించారు. ‘‘మారుతి శైలిలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం ముస్తాబు చేస్తున్నాం. ఆద్యంతం వినోదాత్మకంగా.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి కళ: రామ్‌ కుమార్‌, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని