Kartikeya: కాబోయే భార్య గురించి చెప్పిన కార్తికేయ.. ఆమె ఎవరంటే?
యువ నటుడు కార్తికేయ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆయన నిశ్చితార్థం వైభవంగా సాగింది. ఈ విషయం తెలియగానే.. కార్తికేయ మనువాడబోయే ఆ అమ్మాయి ఎవరా? అని ఆయన అభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: యువ నటుడు కార్తికేయ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆయన నిశ్చితార్థం వైభవంగా సాగింది. ఈ విషయం తెలియగానే.. కార్తికేయ మనువాడబోయే ఆ అమ్మాయి ఎవరా? అని ఆయన అభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు. తాజాగా ఆ సంగతుల్ని కార్తికేయ బయటపెట్టారు. ఆమె పేరు లోహిత. వరంగల్ ఎన్.ఐ.టి.లో చదువుతున్నప్పుడు (2010) ఇద్దరికీ పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు ఏడడుగుల బంధం కాబోతుంది. ‘నా స్నేహితురాలే భార్యగా నా జీవితంలోకి వస్తుందనే విషయాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2010 నుంచి మాకు పరిచయం ఉంది. లోహితని తొలిసారి వరంగల్ ఎన్.ఐ.టి. లో కలిశాను’ అని కార్తికేయ తన మనసులో మాట పంచుకున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన కార్తికేయ ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం ‘రాజా విక్రమార్క’ సినిమాలో నటిస్తున్నారు. అజిత్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘వాలిమై’లో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!