
Kiran Abbavaram: నటుడు కిరణ్ అబ్బవరం ఇంట విషాదం
హైదరాబాద్: నటుడు, ఎస్.ఆర్.కల్యాణమండపం ఫేమ్ కిరణ్ అబ్బవరం ఇంట విషాదం చోటుచేసుకుంది. కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి కన్నుమూశారు. రాయచోటికి చెందిన రామాంజులు ఎర్రగుంట్లలోని సిమెంట్ కర్మాగారంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై కడపకు వస్తుండగా పొల్లూరు వద్ద ఎద్దుల బండిని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామాంజులు కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు విషయం తెలుసుకున్న కిరణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన కడప చేరుకున్నారు. మరోవైపు రామాంజులు మృతి గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు కిరణ్‌కు ఫోన్ చేసి సంతాపం తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.