Paagal: ఆ పది నిమిషాలు థియేటర్లలో ఏమవుతుందో చూడండి: విశ్వక్‌ సేన్‌

‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రాలతో మాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విశ్వక్‌ సేన్‌. తొలిసారి ‘పాగల్‌’ అనే పూర్తిస్థాయి ప్రేమ కథా చిత్రంలో నటించాడు.

Published : 13 Aug 2021 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్‌’ చిత్రాలతో  మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు విశ్వక్‌ సేన్‌. తొలిసారి ‘పాగల్‌’ అనే పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో నటించాడు. నరేశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వ్యాఖ్యాత లాస్యతో ముచ్చటించాడు విశ్వక్‌. ఆ విశేషాలివీ...

* పాగల్‌.. చాలామందికి ఊతపదం. అలాంటిది సినిమా పేరే ‘పాగల్‌’ అని పెట్టారు?

విశ్వక్‌: అప్పట్లో ‘ఇడియట్‌’లా ఇదీ అంతే. కొన్ని సినిమాలు వస్తుంటాయి.. హిట్‌ అవుతాయి.. కొన్నాళ్లకి ఆ కథ గుర్తుండదు. కానీ,  ‘పాగల్‌’ అలా కాదు. ఈ చిత్రంలోని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

* సినిమాలో 1600 మంది అమ్మాయికి లవ్‌ ప్రపోజ్‌ చేశారు కదా. నిజ జీవితంలో ఎంతమందికి చేశారు?

విశ్వక్‌: రియల్‌ లైఫ్‌లో నలుగురికి ప్రపోజ్‌ చేశాను. ఒక్కరు మాత్రమే అంగీకరించారు.

* మీ బెస్ట్‌ ఫ్రెండ్స్‌లో పాగల్‌ ఫ్రెండ్‌ ఎవరు?

విశ్వక్‌: గోపాల్‌ అని ఓ వ్యక్తి ఉంటాడు. ఆయన కొంచెం పాగల్‌ (నవ్వుతూ).

* ఈ సినిమాలోని టైటిల్‌ సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. మరి గూగుల్‌లో మీరు ఎక్కువగా దేని గురించి వెతుకుతారు?

విశ్వక్‌: సినిమాల గురించే ఎక్కువగా వెతుకుతుంటా. సినిమాల్లోంచి బయటకి తీస్తే నేను దేనికీ పనికిరాను.

* ఈ చిత్రంలో భూమిక పాత్ర ఎలా ఉంటుంది?

విశ్వక్‌: భూమిక ఈ సినిమాలో నాకు తల్లిగా నటించారు. ప్రతి ఒక్కరినీ ఈ పాత్ర కట్టిపడేస్తుంది.

* ‘పాగల్‌’ గురించి ప్రేక్షకులకి తెలియనివి ఇంకా ఏమైనా చెప్తారా?

విశ్వక్‌: తెలియంది అంటే.. కడుపుబ్బా నవ్వించే చిత్రమిది. కుటుంబంతో కలిసి చూసే సినిమా. 2.30గంటలు అప్పుడే అయిపోయిందా అనిపించేలా చేస్తా. యాక్షన్ ఎపిసోడ్‌ 10నిమిషాలు ఉంటుంది. అప్పుడు థియేటర్లలో ఏమవుతుందో మీరే చూస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని