నవ్విస్తూ.. కంటతడి పెట్టించే ‘బ్రో’

నవీన్‌ చంద్ర, అవికా గోర్‌ అన్నాచెల్లెలుగా నటించిన చిత్రం ‘చిబ్రో’. టి.కార్తిక్‌ దర్శకుడు. జెజెఆర్‌.రవిచంద్‌ నిర్మించారు. సాయి రోనక్‌, సంజన సారథి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్‌లో

Updated : 07 Dec 2022 21:44 IST

వీన్‌ చంద్ర, అవికా గోర్‌ అన్నాచెల్లెలుగా నటించిన చిత్రం ‘బ్రో’. టి.కార్తిక్‌ దర్శకుడు. జెజెఆర్‌.రవిచంద్‌ నిర్మించారు. సాయి రోనక్‌, సంజన సారథి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్‌ చంద్ర మాట్లాడుతూ..‘‘లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో కష్టపడి చిత్రాన్ని పూర్తి చేశాం. పూర్తిగా అరకు నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇది రీమేక్‌ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి తగ్గట్లుగా కార్తిక్‌ కథలో చాలా మార్పులు చేశారు’’ అన్నారు. ‘‘కార్తిక్‌ చెప్పిన కథ.. నా పాత్ర చాలా నచ్చి సినిమా చేయాలని ఫిక్సయ్యా. వినోదంతో పాటు మంచి సందేశమున్న చిత్రమిది. చూసినంత సేపూ నవ్వుతూనే ఉన్నా.. అదే సమయంలో కంటతడి పెట్టా. అంత వినోదాత్మకంగా, భావోద్వేగభరితంగా సాగుతుందీ చిత్రం’’ అంది నటి అవికా గోర్‌. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో అల్లుకున్న కథతో రూపొందిన చిత్రమిది. మరాఠీలో విజయవంతమైన ‘హ్యాపీ జర్నీ’కు రీమేక్‌గా రూపొందింది. తన చెల్లితో గడిపిన కాలం.. ఓ అన్న జీవితాన్ని ఎలా మార్చిందన్నది ఈ చిత్ర కథాంశం. శేఖర్‌ స్వరాలు, అజీమ్‌ విజువల్స్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. సంగీతం: శేఖర్‌ చంద్ర, ఛాయాగ్రహణం: అజీమ్‌ మహమ్మద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని