Bangarraju: సోగ్గాళ్లోయ్‌... సందళ్లోయ్‌

నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటించిన చిత్రం ‘బంగార్రాజు’. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ

Updated : 01 Jan 2022 09:33 IST

నాగార్జున, నాగచైతన్య కథానాయకులుగా నటించిన చిత్రం ‘బంగార్రాజు’. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కొత్త ఏడాది ఆరంభాన్ని పురస్కరించుకుని శనివారం టీజర్‌ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా తండ్రీ తనయులు నాగార్జున, నాగచైతన్య మీసాలు తిప్పుతూ కనిపిస్తున్న కొత్త లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: యువరాజ్‌, కళ: బ్రహ్మ కడలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని