Dhee 13: ‘ఢీ’లో బుట్టబొమ్మని చూశారా!

‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ గీతం వెండితెరపై ఎంతగానో అలరించింది. అదే సందడిని బుల్లితెరపైకి తీసుకొచ్చింది ‘ఢీ 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’ డ్యాన్స్‌ షో.

Published : 19 Aug 2021 23:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ గీతం వెండితెరపై ఎంతగానో అలరించింది. అదే సందడిని బుల్లితెరపైకి తీసుకొచ్చింది ‘ఢీ 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’ డ్యాన్స్‌ షో. ఈ కార్యక్రమం.. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రతి బుధవారం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈవారం సాయి అనే కంటెస్టెంట్ ‘బుట్టబొమ్మ’ పాటకి డ్యాన్సు చేసి అందరినీ ఫిదా చేశాడు. సింపుల్‌ స్టెప్పులతో కనువిందు చేశాడు. న్యాయ నిర్ణీతల మనసును దోచుకున్నాడు. ఇంతకీ ఆ బుట్టబొమ్మ ఎవరో కాదండోయ్‌! ఓ ఎపిసోడ్‌లో ‘ఆచార్య’ చిత్రంలోని ‘లాహే లాహే’ పాటకి నృత్యం చేసి వావ్‌ అనిపించిన నైనిక. సాయి ఇదే వేదికపై నైనికకి ‘ఐ లవ్‌ యు’ చెప్పి అక్కడున్న వారికి షాక్‌ ఇచ్చాడు. ఈ బుధవారం (ఆగస్టు 18) ప్రసారమైన ఈ ఎపిసోడ్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో అలరిస్తోంది. ఇప్పటి వరకూ మీరు చూడకపోతే ఇక్కడ చూసేయండి....


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని