Prabhas: ప్రభాస్‌ సినిమాపై ఇన్ని గాసిప్స్‌ ఉన్నాయా..?

వరుస పాన్‌ఇండియా ప్రాజెక్ట్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్‌. ప్రస్తుతం ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’లతో ఫుల్‌ బిజీగా ఉన్న ఆయన ఇటీవల సందీప్‌ రెడ్డి వంగాత...

Published : 18 Oct 2021 01:28 IST

హైదరాబాద్‌: వరుస పాన్‌ఇండియా ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్‌. ప్రస్తుతం ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’లతో ఫుల్‌ బిజీగా ఉన్న ఆయన ఇటీవల సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ అనే సినిమాను ఓకే చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్‌ 25వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా గురించి నెట్టింట్లో పలు ఆసక్తికర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ సినిమా కోసం ప్రభాస్‌ తన పారితోషికం కూడా భారీగానే పెంచేశారట.

మరోవైపు ‘స్పిరిట్‌’లో నటించనున్న హీరోయిన్‌ గురించి కూడా చర్చ నడుస్తోంది. బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌ ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన నటించే అవకాశం ఉందని మొన్నటివరకూ అందరూ అనుకున్నారు. కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆమె ప్రతి నాయకురాలి పాత్రలో కనిపించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్‌ డ్రామాగా ‘స్పిరిట్‌’ తెరకెక్కే అవకాశం ఉందని.. ఇందులో ప్రభాస్‌ రన్నర్‌గా కనిపించే అవకాశం ఉందని టాక్‌. అయితే, ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని