
Bigg Boss Telugu 5: ‘టికెట్ టు ఫినాలే’ చివరి ఛాలెంజ్‌లో నిలిచే ఆ ఇద్దరు పోటీదారులు ఎవరు?
హైదరాబాద్: బిగ్‌బాస్ హౌస్‌లో ఇంటిసభ్యులందరూ తుది సమరానికి సన్నద్ధమవుతున్నారు. ‘టికెట్ టు ఫినాలే’లో భాగంగా ఇచ్చిన టాస్క్‌ల్లో విజయం సాధించిన మానస్, సన్నీ, సిరి, శ్రీరామ్‌లకు బిగ్‌బాస్ తాజాగా ఓ సరికొత్త టాస్క్ ఇచ్చాడు. ఆక్యురసీ, మెమొరీ, ఫోకస్.. అనే మూడు టాస్క్‌ల్లో నలుగురూ ఏకాభిప్రాయంతో ఒక్కదాన్ని ఎంచుకోవాలని బిగ్‌బాస్ సూచించాడు. దీంతో సన్నీ.. ‘‘మేడమ్.. మీరే చెప్పండి’’ అని అడగ్గా.. ‘‘మొమరీ తప్ప ఏదైనా ఓకే’’ అని సిరి సమాధానమిచ్చింది. వెంటనే మానస్ అందుకుని.. ‘‘ఏ ఎందుకని?’’ ప్రశ్నించగా.. ‘‘మీకు ఉంది సర్. మాకు లేదు’’ అని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చింది. దాంతో సన్నీ.. ‘‘మెమొరీ, ఫోకస్ వద్దు ఆక్యురసీకి పోదాం’’ అని అనడంతో.. ‘‘నేను ఆడను. నాకు ఫోకస్, మెమొరీ కావాలి’’ అని మానస్ సమాధానమిస్తాడు. దీనిపై స్పందించిన సన్నీ.. ‘‘కాజల్‌తో తిరిగి పెద్ద సైకోలా అవుతున్నావు రా’’ అంటూ సరదాగా కామెంట్ చేయడంతో ఇంటిసభ్యులందరూ పగలబడి నవ్వారు. సన్నీ కామెంట్‌తో కాజల్ షాక్ అవుతుంది. చివరికి వాళ్లందరూ ఫోకస్ ఛాలెంజ్ ఎంచుకోగా.. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌తో సన్నీ ఒకింత ఆశ్చర్యపోయాడు. ఇక, సిరి టాలెంట్‌కి ఇంటిసభ్యులందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ తర్వాత లైట్స్ ఆఫ్, ఆన్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో గెలిచిన వారిలో ఇద్దరు టికెట్ టు ఫినాలే చివరి గేమ్ ఆడతారు.