MAA Elections: చిరంజీవి, మోహన్‌బాబు మంచి స్నేహితులు.. : పవన్‌కల్యాణ్‌

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ కేంద్రంగా పోలింగ్‌ జరుగుతోంది....

Updated : 10 Oct 2021 10:49 IST

ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి, పవన్‌, బాలయ్య

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ కేంద్రంగా పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఇప్పటివరకూ దాదాపు 30శాతం మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ ప్రముఖులు మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, మనోజ్‌, మోహన్‌బాబు, మంచు లక్ష్మి, సుమ, శ్రీకాంత్‌, నరేశ్‌, శివాజీరాజా, ఉత్తేజ్‌, శివబాలాజీ, సుడిగాలి సుధీర్‌, రాఘవతోపాటు పలువురు సీనియర్‌ నటీనటులు ఓటు వేశారు.

ఓటు వేసిన అనంతరం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు స్నేహితులని పేర్కొన్నారు. ‘మా’ ఎన్నికల్లో ఇంత హడావుడి అవసరం లేదన్నారు. సినీ నటులు ఆదర్శంగా ఉండాలని కోరారు. ఈ ఎన్నికల వల్ల సినీ ఇండస్ట్రీ చీలిపోదని స్పష్టం చేశారు.

పోలింగ్‌ కేంద్ర వద్ద ఉద్రిక్తత:

‘మా’ పోలింగ్‌ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ తీరుపై మంచు విష్ణు ప్యానెల్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. నమూనా బ్యాలెట్‌ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని అక్కడి నుంచి పంపించేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని