Ram Gopal Varma: ‘మీ అందర్నీ పెళ్లి చేసుకోవచ్చా’: బుల్లితెరపై ఆర్జీవీ సందడి

ఇంటర్వ్యూ అయినా, ప్రత్యేక కార్యక్రమమైనా, చర్చా వేదికైనా.. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) ఒకేలా ఉంటారు.

Published : 14 Dec 2021 09:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంటర్వ్యూ అయినా, ప్రత్యేక కార్యక్రమమైనా, చర్చా వేదికైనా.. దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) ఒకేలా ఉంటారు. తనకు ఏది అనిపిస్తే అది అనేస్తుంటారు. తనదైన శైలిలో చమత్కరించి అందరినీ ఆకట్టుకుంటారు. ‘పెళ్లాం వద్దు.. పార్టీ ముద్దు’ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మరోసారి అలాంటి సందడినే తీసుకొచ్చారు. ‘నేను మీ అందరినీ పెళ్లి చేసుకోవచ్చా?’ అని ఆ వేదికపై ఉన్న అమ్మాయిలందరినీ అడిగి, ఆశ్చర్యానికి గురిచేశారు. నూతన సంవత్సరం కానుకగా ఈ ప్రత్యేక కార్యక్రమం రూపొందింది. డిసెంబరు 31న ‘ఈటీవీ’లో ప్రసారంకానున్న ఎపిసోడ్‌ ప్రోమో ఈ విశేషాల్ని తెలియజేసింది. ఈ ఈవెంట్‌లో ఆర్జీవీతోపాటు ఇంద్రజ, రష్మి, లాస్య, ‘జబర్దస్త్‌’, ‘ఢీ’ తదితర కార్యక్రమాల కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని