RRR Trailer: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ వాయిదా.. టీమ్‌ ఏం చెప్పిందంటే..!

రామ్‌చరణ్‌, తారక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటరికల్‌ ట్రైలర్‌ వాయిదా పడింది. ఈ సినిమా ట్రైలర్‌ని డిసెంబర్‌ 3న విడుద...

Updated : 01 Dec 2021 13:11 IST

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌, తారక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటరికల్‌ ట్రైలర్‌ వాయిదా పడింది. ఈ సినిమా ట్రైలర్‌ని డిసెంబర్‌ 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించినప్పటికీ.. ప్రముఖ సినీ సాహిత్య రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు కొన్ని అనుకోని కారణాల వల్ల ట్రైలర్‌ విడుదల వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. త్వరలో ట్రైలర్‌ విడుదల తేదీని ప్రకటిస్తామని తెలియజేసింది.

సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె చరణ్‌కు జోడీగా కనిపించనున్నారు. తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Cinema News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని