Social Look: రకుల్‌ కామెడీ సిరీస్‌.. భూమిక ఫొటోషూట్‌ జ్ఞాపకాలు

‘పొట్ట చెక్కలయ్యే వరకు నవ్వండి’ అంటూ నవ్వుతున్న తన ఫొటోని పంచుకుంది నాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. కామెడీ ప్రధానంగా తాను నటించిన ఓ వెబ్‌ సిరీస్‌ త్వరలోనే రాబోతుందని తెలిపింది.

Published : 06 Aug 2021 01:50 IST

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్: ‘పొట్ట చెక్కలయ్యే వరకు నవ్వండి’ అంటూ నవ్వుతున్న తన ఫొటోని పంచుకుంది నాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. కామెడీ ప్రధానంగా తాను నటించిన ఓ వెబ్‌ సిరీస్‌ త్వరలోనే రాబోతుందని తెలిపింది.

* ‘హీటెక్కించే వేసవి.. చల్లని పానీయం’ అని పోస్ట్‌ చేసింది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉంది.

* యువ నాయిక ప్రియాంక జవాల్కర్‌ నటించిన ‘ఎస్‌.ఆర్‌. కల్యాణమండపం’ చిత్రం శుక్రవారం విడుదలవుతుంది. ఈ సందర్భంగా షూటింగ్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు షేర్‌ చేస్తూ తనకి అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేసింది.

* సముద్ర తీరంలో ఉయ్యాల ఊగుతూ కనిపించింది నటి వేదిక. ‘సీ సోల్‌’ అంటూ కొన్ని ఫొటోలు షేర్‌ చేసింది.

* పదేళ్లనాటి ఫొటోషూట్‌ని గుర్తు చేసుకుంది భూమిక. ఫొటోగ్రాఫర్‌ చెప్పినట్టు హావభావాలు పలికించేందుకు నా వంతు ప్రయత్నం చేశాను అని చెప్పుకొచ్చింది.






























Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని