Vijay: ‘విజయ్‌ 69’ ఖరారు?

తమిళ కథానాయకుడు విజయ్‌ నుంచి కొత్త కబురు రానుంది. ఆయన ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత విజయ్‌..

Updated : 26 Jan 2024 09:34 IST

తమిళ కథానాయకుడు విజయ్‌ నుంచి కొత్త కబురు రానుంది. ఆయన ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత విజయ్‌.. దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజుతో చేతులు కలపనున్నారని సమాచారం. ‘పిజ్జా’, ‘జిగర్‌తండ’ లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు కార్తీక్‌. ఇటీవలే ‘జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌’తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడాయన విజయ్‌ కోసం ఓ శక్తిమంతమైన కథ సిద్ధం చేశారని తెలిసింది. అది ఆయనకు కూడా నచ్చడంతో పచ్చజెండా ఊపారని టాక్‌. విజయ్‌ 69వ చిత్రంగా పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని