AP news: ఆంధ్రప్రదేశ్‌లో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

సినిమా అభిమానులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి నుంచి థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లు తెరుచుకోవచ్చని పేర్కొంది. దీంతో జులై 31 నుంచి థియేటర్లలో సందడి మొదలు కానుంది.

Published : 29 Jul 2021 15:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సినిమా ప్రియులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లో జులై 31వ తేదీ నుంచి థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లు తెరుచుకోవచ్చని పేర్కొంది. దీంతో శనివారం నుంచి థియేటర్లలో సందడి మొదలు కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ జులై 8వ తేదీ నుంచి థియేటర్లు తెరుచుకోవచ్చని చెప్పినప్పటికీ ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య తలెత్తిన వివాదం కారణంగా థియేటర్లు తెరచుకోలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చింది. శానిటైజర్లు, సామాజిక దూరం, మాస్కులు వంటి కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడిపించాలని ప్రభుత్వం సూచించింది. అయితే, 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లు నడపటం తమకు నష్టమని థియేటర్‌ యజమానుల చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో ప్రభుత్వం గతంలోనే పూర్తి సామర్థ్యంతో థియేటర్లు నడిపించుకోవచ్చని అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు తెరచుకోవడంతో ఎప్పటి నుంచో విడుదల కోసం ఎదురుచూస్తున్న చిన్న, పెద్ద సినిమాలు విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం సత్యదేవ్‌ నటించిన ‘తిమ్మరుసు’, తేజ-ప్రియా ప్రకాశ్ వారియర్‌ జంటగా నటించిన ‘ఇష్క్‌’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని