మహేశ్‌.. బన్నీ.. సినిమాల్లో ఊర్వశి స్టెప్పులు.!

బాలీవుడ్‌ సుందరి ఊర్వశి రౌతేలా టాలీవుడ్‌లో అరంగేట్రంలోనే భారీ ఆఫర్లే కొట్టేసినట్లు కనిపిస్తోంది. ‘రెడ్‌రోజ్‌’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన మొదటి చిత్రం విడుదల కాకముందే ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వరుస కడుతున్నాయట. ఆ మధ్య ‘పుష్ప’లో ఐటమ్‌ సాంగ్‌ చేస్తుందనుకున్న దిశాపటానీ ఏవో కారణాలతో తప్పుకుంది.

Published : 25 Jan 2021 17:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ సుందరి ఊర్వశి రౌతేలా టాలీవుడ్‌ అరంగేట్రంలోనే భారీ ఆఫర్లు కొట్టేసినట్లు కనిపిస్తోంది. ‘రెడ్ ‌రోజ్‌’తో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు ఇప్పటికే సిద్ధమైంది. తన మొదటి చిత్రం విడుదల కాకముందే ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వరుస కడుతున్నాయట. ఆ మధ్య ‘పుష్ప’లో ఐటమ్‌ సాంగ్‌ చేస్తుందనుకున్న దిశాపటానీ ఏవో కారణాలతో తప్పుకుంది. దాంతో ఊర్వశికి స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌తో స్టెప్పేసే అవకాశం వచ్చింది. ఇదంతా ఇలా ఉండగా.. ఆమె తాజాగా మరో సినిమాలోనూ ఐటమ్‌ సాంగ్‌ చేసేందుకు పచ్చజెండా ఊపిందని తెలుస్తోంది. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా వస్తున్న ‘సర్కారువారి పాట’లో ఊర్వశి ఐటమ్‌గాళ్‌గా ఉర్రూతలూగించనుందని సినీ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే.. దీనికి సంబంధించి ఎలాంటి అధికారికా ప్రకటనా రాలేదు.

ప్రస్తుతం ఊర్వశి ప్రధానపాత్రలో నటించిన తెలుగు చిత్రం ‘బ్లాక్‌రోజ్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. థ్రిల్లర్‌ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు మోహన్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహించారు. సంపత్‌నంది కథ అందించగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు. చిత్తూరి శ్రీనివాస నిర్మాత.

ఇదీ చదవండి..

ఆర్‌ఆర్‌ఆర్‌: రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు