NKR21: కల్యాణ్‌ రామ్‌ చిత్రంలో విజయశాంతి

కల్యాణ్‌ రామ్ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. అందులో విజయశాంతి (Vijayashanti) కీలకపాత్రలో నటించనున్నారు.

Published : 20 Oct 2023 17:15 IST

హైదరాబాద్‌: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ అలరిస్తున్నారు ఒకప్పటి స్టార్‌ హీరోయిన్ విజయశాంతి (Vijayashanti). మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో ఆకట్టుకున్న ఆమె తాజాగా కల్యాణ్‌రామ్‌ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కల్యాణ్‌ రామ్‌ (Kalayam Ram) హీరోగా ప్రదీప్‌ చిలుకూరి ఓ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. నేడు ఆ సినిమా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విజయశాంతి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం తాజాగా షేర్‌ చేసింది.

సునీతతో నాకు మంచి అనుబంధం ఉంది: ఉష

కల్యాణ్‌ రామ్ 21వ చిత్రం.. #NKR21గా ప్రచారమవుతోంది. భారీ బడ్జెట్‌ మూవీగా ఇది రూపొందనుంది. సయీ మంజ్రేకర్‌ హీరోయిన్. అలాగే ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ విజయశాంతి ఇందులో కీలకపాత్రలో నటించనున్నారు. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది తెరకెక్కనుంది. ప్రస్తుతం కల్యాణ్‌ రామ్ ‘డెవిల్‌’(Devil) చిత్రంతో పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ‘ది బ్రిటిష్ సీక్రెట్‌ ఏజెంట్‌’ అనేది దాని ఉపశీర్షిక. సంయుక్త కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంతో నవీన్‌ మేడారం దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న ‘దేవర’ సినిమాకు కల్యాణ్‌ రామ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని