Vikram: ‘విక్రమ్‌’ ట్రైలర్‌లో టామ్‌ క్రూజ్‌.. వీడియో వైరల్‌

విశ్వనటుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan), ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil), విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘విక్రమ్‌’ (Vikram).

Published : 06 Oct 2022 01:32 IST

హైదరాబాద్‌: విశ్వనటుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan), ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil), విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘విక్రమ్‌’ (Vikram). మాదక ద్రవ్యాల నిషేధం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలై ఐదు నెలలు అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్‌ ‘విక్రమ్‌’ ట్రైలర్‌తో స్పెషల్‌ వీడియో క్రియేట్‌ చేశాడు. హాలీవుడ్‌ నటుడు టామ్‌క్రూజ్‌, మహేశ్‌బాబు, బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌.. నటించిన సినిమాల్లోని సన్నివేశాలకు ‘విక్రమ్‌’ ట్రైలర్‌లోని డైలాగ్‌లను యాడ్‌ చేసి ఈ వీడియో క్రియేట్‌ చేశాడతను. ఇందులో మహేశ్‌బాబు.. కమల్‌హాసన్‌ రోల్‌లో కనిపించగా.. ఫహద్‌గా టామ్‌క్రూజ్‌, విజయ్‌ సేతుపతిగా హృతిక్‌ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని