
Published : 17 Jan 2022 10:08 IST
Vishnu Priya: ‘ఐటమ్ సాంగ్స్’తో హాట్ హాట్‌గా అదరగొట్టిన విష్ణు ప్రియ
హైదరాబాద్: ‘పుష్ప’ విడుదలైన దగ్గరి నుంచి అటు కథానాయికలతో పాటు, ఇటు యువత సైతం ‘ఊ అంటావా మావ’ పాటకు ఫిదా అయిపోయారు. ఇక గత కొన్ని రోజులుగా టెలివిజన్‌లో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమంలోనూ ఎవరో ఒకరు ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్నారు. ప్రతి ఆదివారం తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. తాజాగా ఇందులో బుల్లితెర నటి, వ్యాఖ్యాత విష్ణు ప్రియ ‘ఊ అంటావా మావ’ పాటకు డ్యాన్స్ చేసి మెస్మరైజ్ చేసింది. డ్యాన్స్ చేస్తూ ఆమె పలకించిన హావభావాలు, స్టెప్స్‌కు యువతను కట్టిపడేస్తున్నాయి. ఆదివారం ఈటీవీలో ప్రసారమైన ఈ ఎపిసోడ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది. దీనికి తోడు గెటప్ శ్రీను, హైపర ఆది, రాంప్రసాద్, సుధీర్ వేసిన పంచ్‌లు నవ్వులు పూయిస్తున్నాయి.
Tags :