
విదేశాల నుంచి వస్తే 14 రోజుల క్వారంటైన్!
ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం
ముంబయి: కరోనా వైరస్ కాస్త స్ట్రెయిన్‌గా మారి యావత్తు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. కొత్తరకం స్ట్రెయిన్‌ను అడ్డుకునేందుకు భారత్ సహా అన్ని దేశాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా.. బ్రిటన్, దక్షిణాఫ్రికా, యూరప్, గల్ఫ్ దేశాల నుంచి ముంబయికి వచ్చే ప్రయాణికులందరూ 14 రోజులపాటు గృహనిర్భందంలో ఉండాలని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. అలాగే ప్రయాణికులను వారు కోరుకున్న హోటళ్లకు తరలించాలని నిర్ణయించింది. అక్కడ వారి సొంత ఖర్చుతో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఒకవేళ రిపోర్టు నెగెటివ్ వస్తే ఏడు రోజుల అధికారిక క్వారంటైన్ సహా మరో ఏడు రోజుల గృహనిర్భందం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు పాజిటివ్ వస్తే ముంబయిలోని సెవెన్‌హిల్స్ ఆసుపత్రి, ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ నిర్ధరణ అయితే స్థానిక జీటీ ఆసుపత్రికి తరలించనున్నారు. కొత్తరకం వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈనెల 31 వరకు బ్రిటన్ నుంచి వచ్చే అన్ని విమానాలను భారత్ నిలిపివేసింది. అటు దక్షిణాఫ్రికాలోనూ కొత్త రకం వైరస్ మూలాలను అక్కడి వైద్య నిపుణులు కనుగొన్నారు. ఇప్పటి వరకు భారత్‌లో 2,78,690 యాక్టివ్ కేసులుండగా.. గడిచిన 24 గంటల్లో మరో 18,732 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.