Published : 13 Oct 2020 19:58 IST

దిగ్విజయంగా ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

సింగపూర్‌: తెలుగు సాహితీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టిస్తూ అక్టోబరు 10, 11వ తేదీల్లో జరిగిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు దిగ్విజయంగా ముగిసింది. అంతర్జాలంలో 36 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సదస్సును పదివేల మందికిపైగా తెలుగు భాషాభిమానులు వీక్షించారు. సుమారు 200 మంది సాహితీవేత్తలు, 15 ప్రసంగ వేదికలలో పాల్గొని వివిధ అంశాల మీద మాట్లాడారు. ప్రముఖ గాయని సునీత ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (అమెరికా, హైదరాబాద్), సాంస్కృతిక కళా సారధి (సింగపూర్), తెలుగు మల్లి (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహానెస్ బర్గ్), సి.పి. బ్రౌన్ తెలుగు సమాఖ్య (లండన్) సంస్థల సంయుక్తంగా నిర్వహించాయి. ఇటీవల తుది శ్వాస విడిచిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి ఘన నివాళి అర్పిస్తూ ఈ 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును ఆయనకు అంకిత మిచ్చారు.

పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ సభకు, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పంపిన అభినందనల సందేశాన్ని అందజేశారు. డా.కె.వి. రమణాచారి, మండలి బుద్ధ ప్రసాద్, ప్రముఖ సినీ నటులు రచయిత తనికెళ్ల భరణి, ఆచార్య సి. మృణాళిని, దేశపతి శ్రీనివాస్, ఆచార్య ఆవుల మంజులత తదితరులు ప్రసంగాలు చేశారు. 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు తరఫున వంగూరి, మధు పెమ్మరాజు, డా.రెంటాల వెంకటేశ్వరరావు, డి.ఆర్.ఇంద్ర, చాయా మోహన్ బృందం ప్రముఖ రచయిత సాహితీవేత్త తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రికి ‘జీవన సాఫల్య పురస్కారం’ చేశారు. ఈ సందర్భంగా  ప్రముఖ సంగీత దర్శకులు  స్వర వీణాపాణి ఈ సదస్సుకు అంకితమిస్తూ ప్రత్యేకంగా ఒక గీతాన్ని వ్రాసి ఆలపించారు. ప్రత్యేక అంశాలుగా అండమాన్, నికోబార్ దీవులలో తెలుగు వారి సాహిత్య సేవ గురించి మేడసాని శ్రీనివాస్ వివరించారు.

15 దేశాల రచయితలు పాల్గొన్న ఈ రెండు రోజుల పాటు నిర్విరామ సాహితీ సదస్సులో ప్రముఖ సాహితీ వేత్త భువనచంద్ర తో ముఖాముఖి, ఎస్పీ బాలూకి చెరుకూరి రమాదేవి (డెట్రాయిట్) ఆత్మీయ నివాళి, పొత్తూరి విజయలక్ష్మి, రామా చంద్రమౌళి, డా.శిఖామణి, ముక్తేవి భారతి, ఆచార్య కాత్యాయని విద్మహే, వడ్డేపల్లి కృష్ణ, ఆచార్య ఎస్.వి సత్యనారాయణ, కె. శ్రీనివాస రావు (సాహిత్య అకాడమీ), వోలేటి పార్వతీశం, రేవూరు అనంత పద్మనాభ రావు, అత్తలూరి విజయలక్ష్మి, పాపినేని శివశంకర్, ‘హాస్య బ్రహ్మ’ శంకర నారాయణ, రేణుక అయోల, రాజేశ్వరి శివుని, గంగిశెట్టి లక్ష్మీనారాయణ మొదలైన భారత దేశ రచయితలు, 15 దేశాల ప్రముఖ రచయితల ప్రసంగాలూ ఆసక్తికరంగా సాగాయి.

ఈ 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయవంతం కావడంలో ప్రధాన కార్య నిర్వాహక వర్గం సభ్యులు వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ (హ్యూస్టన్), రత్న కుమార్, రాధిక మంగిపూడి (సింగపూర్), రావు కొంచాడ (మెల్‌బోర్న్‌), రాపోలు సీతారామరాజు (జొహానెస్ బర్గ్), జొన్నలగడ్డ మూర్తి (ఇంగ్లాండ్‌), వంశీ రామరాజు (హైదరాబాద్), రాధాకృష్ణ, కాత్యాయని గణేశ, భాస్కర్ ఊలపల్లి, సుధాకర్ జొన్నాదుల (సింగపూర్), కృష్ణ రావిపాటి (మెల్‌బోర్న్), మధు చెరుకూరి (ఆర్లండో), రఘు ధూళిపాళ (సియాటిల్) విశేష కృషి చేశారు.

Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని