TANA: తానా సంయుక్త కార్యదర్శిగా తాళ్లూరి
టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సంయుక్త కార్యదర్శిగా మురళి తాళ్లూరి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 11,277 ఓట్లు సాధించి విజయం దక్కించుకున్నారు. తెలంగాణకు చెందిన తాళ్లూరి.. తానా ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన పాఠశాల విద్యనంతా కారేపల్లిలోనే పూర్తి చేశారు. ఖమ్మంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ లో ఎంసీఏ చదువుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. అక్కడ టెక్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ సంస్థను స్థాపించి, పలువురు భారతీయ తెలుగు విద్యార్థులకు ఉపాధిని కల్పించారు.
గడిచిన 20 సంవత్సరాలుగా అమెరికాలోని ఆస్టిన్ టెక్సస్ నగరంలో స్థిరపడ్డారు. తానాలో 2013 నుంచి 2020 వరకు వివిధ హోదాల్లో పనిచేసి మంచి గుర్తింపు పొందారు. గత ఏడాది కరోనా సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు, వలస కార్మికులకు, అమెరికాలోని తెలుగు వారికి కూడా ఆయన సేవలు అందించారు. తద్వారా తానాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. తాజాగా తానా ఎన్నికల్లో సంయుక్త కార్యదర్శిగా పోటీ చేశారు. ప్రత్యర్థిపై 11,277 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఉన్న విశ్వాసంతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యలను నిబద్ధతతో పూర్తి చేస్తానని, తానా అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. మురళి తాళ్లూరి విజయం పట్ల ఆయన సహాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Tollywood Movies: ఈ వసూళ్లు చూసి సంబరాలు చేసుకోకూడదు: తమ్మారెడ్డి భరద్వాజ
-
India News
Jagdeep Dhankhar: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రమాణ స్వీకారం
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Dinesh Karthik: కార్తిక్ మంచి ఫినిషరే.. కానీ వీళ్లే అసలైన ఫినిషర్లు: మాజీ క్రికెటర్
-
World News
Rishi Sunak: తప్పుడు వాగ్దానాలతో గెలవడం కంటే ఓడిపోవడమే మేలు..!
-
World News
China: మసూద్ అజార్ సోదరుడికి చైనా అండ.. భారత్ ప్రయత్నాలకు అడ్డుపుల్ల..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి